Sri Bhatti Vikramarka Mallu
Jupally Krishna Rao
తెలంగాణ ఉద్యమంలో కళాకారుల పాత్ర ఎంతో గొప్పది. అలాంటి కళాకారులను ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయడం ద్వారా ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రచారం చేయాలనే సంకల్పంతో "తెలంగాణ సాంస్కృతిక సారథి" వ్యవస్థను G.O.Ms.No.6, YAT&C Department, Dt:27.11.2014 ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. మొదటి దశలో 550 మంది కళాకారులకు ఉద్యోగాన్ని, ఉపాధిని కల్పించింది.
జిల్లా కలెక్టర్ సారధ్యంలో, పౌర సంబంధాల అధికారి మార్గదర్శకత్వంలో ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల భాషలో జానపద శైలిలో ఆట పాటల రూపంలో ప్రచారం చేయడం ఈ సంస్థ లక్ష్యం.
దీని కార్యాలయం మాధాపూర్ లోని కావూరి హిల్స్ లో స్టేట్ ఆర్ట్ గ్యాలరీ ప్రాంగణంలో ఏర్పాటు చేయడం జరిగింది.
తెలంగాణ సాంస్కృతిక సారథి కవులు, కళాకారులు రాసిన అభివృద్ధి, సంక్షేమ గీతాలతో "సంక్షేమ స్వరాలు" పేరిట 505 గీతాల పుస్తకాన్ని ప్రచురించడం జరిగింది.
కరోనా సమయంలో ప్రజలలో అవగాహనను పెంపొందించే లక్ష్యంతో జిల్లాకొక యూట్యూబ్ ఛానల్ చొపున్న 33 ఛానెల్ లను రూపొందించి, వాటిలో సాంస్కృతిక సారథి కళాకారులు పాడిన పాటలను, చైతన్య గీతాలను అప్ లోడ్ చేయడం జరిగింది. ఇలా దేశవ్యాప్తంగా 33 యూట్యూబ్ ఛానెల్స్ ఉన్న ఒకే ఒక ప్రభుత్వ సంస్థగా తెలంగాణ సాంస్కృతిక సారథి అరుదైన స్థాయిని సాధించింది.
S.No | Name of the District | No.of Artists |
---|---|---|
1 | Adilabad | 17 |
2 | Bhadradri Kothagudem | 14 |
3 | Hanumakonda | 30 |
4 | Jagtial | 13 |
5 | Jangaon | 21 |
6 | Jayashankar Bhupalpally | 23 |
7 | Jogulamba Gadwal | 9 |
8 | Kamareddy | 16 |
9 | Karimnagar | 23 |
10 | Khammam | 16 |
11 | Kumuram Bheem | 6 |
12 | Mahabubabad | 28 |
13 | Mahabubnagar | 10 |
14 | Mancherial | 18 |
15 | Medak | 12 |
16 | Mulugu | 18 |
17 | Nagarkurnool | 10 |
18 | Nalgonda | 16 |
19 | Narayanpet | 8 |
20 | Nirmal | 8 |
21 | Nizamabad | 12 |
22 | Peddapalli | 21 |
23 | Rajanna Sircilla | 15 |
24 | Rangareddy | 32 |
25 | Sangareddy | 17 |
26 | Siddipet | 30 |
27 | Suryapet | 19 |
28 | Vikarabad | 10 |
29 | Wanaparthy | 8 |
30 | Warangal | 29 |
31 | Yadadri Bhuvanagiri | 20 |
32 | Medchal-Malkajgiri | 21 |
Total | 550 |